ఉన్న స్థానం నుండి ఇంకా
ఉన్నతికి చేరుకోవాలని
కొన్ని మండూకాల పోరాటం
వాటి కాళ్లులాగి కిందికి
దోసెయ్యాలని మరికొన్నింటి
ఎడతెగని ఆరాటం..
ఆశల అంబారీనెక్కి కలల సవారీనెక్కి
ఊరేగుతున్న వారు
ఉన్నఫళంగా బొక్క బోర్లాపడితే
పోరాట ఆరాటాల నడుమ
పోరుసల్పి సల్పి
అలిసిన అమాయక చక్రవర్తులు..
అడ్డదారినెక్కి గడ్డ మీద
పడ్డ కొందరు ప్రబుద్ధులు
నా దారి రహదారి అనేవాడు
ఇంకా గమ్యం తెలీని
బాటసారియై మిగిలాడు..
ఎన్నికలతో ముడివడి
వాటితోనే మూడుముళ్లు పడ్డ
బదిలీల సంసారం కథ
ఎన్నికల నోటిఫికేషన్‌తో
కంచికి చేరింది..
ఐదేళ్లకోసారి వచ్చే జాతర కోసం
ఏర్పాటుచేసిన హంగామా
ఇక ముగిసింది
ఉపాధ్యాయ ప్రయోజనాల పర్వం
వేల యోజనాల దూరంలోనే
ఆగిపోయింది!
మొసళ్ళ రాజ్యంలో
గుంటనక్కల మంత్రాంగంలో
అన్ని కుట్రలు కుతంత్రాలే..
ఆశపడ్డ జీవితాలకు
నలుదిక్కులా నిరాశా నిస్ప ృహలే!
- సర్ఫరాజ్ అన్వర్
94409 81198










