చాలామంది ఇళ్లల్లో టమాటా లేకుండా ఏ వంట పూర్తికాదు. వంటకు రుచిని మాత్రమే కాకుండా, టమాటాలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు, సౌందర్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే చాలామంది టమాటా తింటే కిడ్నీలో రాళ్ల సమస్యలు వస్తాయని నమ్ముతారు. మరి నిజంగానే టమాటాలతో కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయా ?
- టమాటాలో విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ రెడ్ సిట్రిక్ ఫ్రూట్ కంటిచూపుకు మేలు చేస్తుంది. డయాబెటిక్ సమస్యలను తగ్గిస్తుంది. సూర్యరశ్మి నుండి రక్షిస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
- కిడ్నీ స్టోన్స్‌లో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో చాలా సాధారణమైనవి కాల్షియం స్టోన్స్. మన కిడ్నీలో కాల్షియం ఆక్సలేట్ అధికంగా చేరడం వల్ల ఈ రాళ్లు ఏర్పడతాయి. ఆక్సలేట్ అనేది వివిధ కూరగాయలు, పండ్లలో సహజంగా లభించే పదార్థం. మన కాలేయం రోజుకు కొంత మొత్తంలో కాల్షియంను ఉత్పత్తి చేస్తుంది. మన ఎముకలు, కండరాలు రక్తం నుండి కాల్షియంను గ్రహిస్తాయి. అయితే రక్తంలో ఈ పోషకం మొత్తం పెరిగినప్పుడు, అది మూత్రంలో విసర్జించబడటానికి మూత్రపిండాలకు వెళుతుంది.
- చాలా సార్లు మూత్రపిండాలు శరీరం నుండి అదనపు కాల్షియంను తొలగించలేవు. ఇది క్రమంగా పేరుకుపోతుంది. అదే రాళ్లుగా రూపాంతరం చెందుతుంది.
- టమాటాలో అధిక మొత్తంలో ఆక్సలేట్ ఉన్నందున టమాటాలు తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉందని భావిస్తారు. టమాటాలో ఆక్సలేట్ ఉంటుంది. కానీ, దాని పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లను కలిగించదు. 100 గ్రాముల టమాటాలో 5 గ్రాముల ఆక్సలేట్ మాత్రమే ఉంటుంది.
- ఆరోగ్యంగా ఉండి, కిడ్నీ సమస్య లేకుంటే, టమోటాలు తినడానికి భయపడనవసరం లేదు. కానీ, కిడ్నీ సంబంధిత సమస్య ఉంటే ఆక్సలేట్ సహిత ఆహారం పరిమితంగా తీసుకోవాలి.
- నిపుణుల అభిప్రాయం ప్రకారం, టమాటా మూత్రపిండాలకు హానికరం కాదు. దాని పోషక విలువ ఒక వ్యక్తి మొత్తం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
టమాటాలను ఎవరు తినకూడదు ?
- కిడ్నీలో రాళ్లతో బాధపడేవారు తినకూడదు.
- కీళ్ల నొప్పులతో బాధపడేవారు టమాటాలకు దూరంగా ఉండాలి.










