
న్యూఢిల్లీ : ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా ఇండియా కొత్త సెల్టోస్‌లో రెండు వేరియంట్లను విడుదల చేసింది. జిటిఎక్స్ ప్లస్ (ఎస్), ఎక్స్‌లైన్ (ఎస్)లను అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఎడిఎఎస్) లెవెల్-2 సాంకేతికతతో వీటిని అభివృద్థి చేసినట్లు పేర్కొంది. వీటి ఎక్స్‌షోరూం ప్రారంభ ధరను రూ.19.39 లక్షలుగా నిర్ణయించింది. కొత్త సెల్టోస్ సగటు వెయిటింగ్ పీరియడ్ 15 నుంచి 16 వారాలు ఉంది. నూతన వేరియంట్లను 7-9 వారాల్లోనే డెలివరీ చేయనున్నట్టు కియా పేర్కొంది.