Jun 04,2023 06:45

నా పేరు ఖుషి. నేను 6వ తరగతి చదువుతున్నా. మా నాన్నగారు డిఫెన్స్‌లో ( ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ) సర్వీస్‌ చేయడం వల్ల మా ఫ్యామిలీ ఎప్పుడూ మా సొంత ఊరుకు వచ్చే అవకాశం ఉండేది కాదు. ఈ సంవత్సరం ఆ అవకాశం దొరికింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు మేము ఎన్ని మిస్‌ అయ్యామో తెలిసింది. అబ్బ, జేజి (గ్రాండ్‌ పేరెంట్స్‌ ) మా మీద చూపించే శ్రద్ధ, ప్రేమ ఇంటి చుట్టుపక్కల అత్త - మామ, అక్క - బావ, అన్న - తమ్ముడు, అవ్వ - తాత అంటూ వరుసలతో పిలిచే పలకరింపులు .. నాకు ఎంతో కొత్తగా, ఇష్టంగా అనిపించింది. వీధిలో ఉండే పిల్లలతో ఆడే ఆటలు కొత్తగా ఉన్నాయి. చాలా సరదాగా అనిపించాయి. స్కూలు, ట్యూషన్‌, స్పెషల్‌ క్లాస్‌ అనే ప్రపంచం నుండి పల్లెటూర్లలో ఆటలు ఆడుకుంటుంటే ఖుషీిగా ఉంది. తోటి పిల్లల మాటలు, కబుర్లు వింతగా అనిపించాయి. వారితో కలిసి ఈతకు వెళ్లా. అక్కడ బాగా కేకలు వేసి కేరింతలతో మరో ప్రపంచానికి వచ్చామా అన్నంతగా ఉంది. ఈ సంవత్సరం సెలవులు నాకు తీపి జ్ఞాపకాల్లా మిగులుతాయి.

2

 

 

 

 

 

- మల్లు ఖుషాల్‌ రెడ్డి, ఎర్రగుంట్ల, కడప జిల్లా.