Nov 28,2022 07:14

డిసెంబరు 4వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు విజయవాడ గాంధీనగర్‌లోని ఎన్జీవో హౌం భవన్‌లో కవిత స్మారక జాతీయ సాహిత్య పురస్కారాల ప్రదాన సభ జరుగుతుంది. ఈ సభకు ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ అధ్యక్షులు వాసిరెడ్డి పద్మ హాజరవుతారు. సాహితీవేత్తలు కేంద్రసాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత వేంపల్లె షరీఫ్‌, బంగార్రాజు కంఠ, డా.తూములూరి రాజేంద్రప్రసాద్‌, డా.యం.బి.డి.శ్యామల ఈ సభలో పాల్గొంటారు. కందుకూరి నవలా పురస్కారాన్ని ఎం.అరుణకుమారి (చిత్తూరు), గురజాడ కథా పురస్కారాన్ని భండారు విజయ (హైదరాబాద్‌), శ్రీశ్రీ కవితా పురస్కారాన్ని పద్మావతి రాంభక్త (విశాఖపట్నం), జానమద్ది సాహిత్య పురస్కారాన్ని కిన్నెర శ్రీదేవి (కుప్పం), డా.రావూరి భరద్వాజ బాల సాహిత్య పురస్కారాన్ని సమ్మెట ఉమాదేవి (సికింద్రాబాద్‌) ఈ సభలో అందుకోనున్నారు.

- అలపర్తి పిచ్చయ్య చౌదరి, బోయపాటి దుర్గాకుమారి,
కవిత విద్యాసాంస్క ృతిక సేవాసంస్థ