ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో కొన్ని నెలలుగా రేషన్ కందిపప్పు పంపిణీ లేకపోవడం పట్ల ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దసరా పండుగ సమయంలో కూడా ఒకటి రెండు జిల్లాల్లోనే కందిపప్పు ప్రభుత్వం పంపిణీ చేసింది. మిగిలిన జిల్లాల్లోని రేషన్ కార్డుదారులకు కందిపప్పు పంపిణీ చేయకుండా ప్రభుత్వం మొండి చెయ్యి చూపింది. రానున్నది ఎన్నికల సీజన్ కావడం, వరుసగా పండుగలు వస్తుండటంతో నవంబరు నుంచి కందిపప్పు పంపిణీ చేసేందుకు కసరత్తు ప్రారంభించింది.










