
ప్రజాశక్తి-విజయవాడ :ప్రముఖ సినీ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమం శుక్రవారం విజయవాడలో అట్టహాసంగా నిర్వహించారు. గురునానక్ కాలనీలోని కెడిజిఒ పార్కులో ఏర్పాటుచేసిన విగ్రహాన్ని విశ్వనటుడు, పద్మభూషణ్ కమల్‌హాసన్ ఆవిష్కరించారు. ఇండియన్-2 చిత్ర నిర్మాణం కోసం కమల్‌హాసన్ విజయవాడ వచ్చారు. దీనిలో భాగంగా కృష్ణ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జ్ దేవినేని అవినాష్, కృష్ణ అభిమానులు పాల్గన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ.. తెలుగు ఇండిస్టీలో తనదైన ముద్ర వేసిన నటుడు కృష్ణ అని అన్నారు. అయన వారసత్వంతో ఇండిస్టీలోకి వచ్చిన మహేష్‌బాబు అటు సినీరంగంలోనూ, ఇటు సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటూ కృష్ణ పేరు నిలబెడుతున్నారని తెలిపారు. షూటింగ్‌లో బిజీగా ఉండే కమల్‌హాసన్ ఇక్కడకు రావడం సంతోషంగా ఉందన్నారు. పదిరోజుల వ్యవధిలోనే కఅష్ణ విగ్రహం ఏర్పాటుకు సహకరించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి కృష్ణ కుటుంబ సభ్యుల తరపున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.