
చీమకుర్తి (ప్రకాశం) : ప్రకాశం జిల్లా చీమకుర్తిలో వైస్ రాజశేఖర్ రెడ్డి, బూచేపల్లి విగ్రహాలను సిఎం జగన్ ఆవిష్కరించారు. బుధవారం తాడేపల్లిలోని తన నివాసం నుంచి ప్రకాశం జిల్లా చీమకుర్తికి సిఎం జగన్ హెలికాప్టర్‌లో బయలుదేరారు. చీమకుర్తి మెయిన్‌రోడ్డులోని బూచేపల్లి సుబ్బారెడ్డి కల్యాణ మండపం వద్ద వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డిల కాంస్య విగ్రహాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం ప్రసంగించారు.