Jul 01,2022 10:45

ప్రజాశక్తి-కాజులూరు (కాకినాడ) : కాజులూరు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహ ఆవిష్కరణకు అభిమానులు తరలిరావాలని కాకినాడ క్షత్రియ పరిషత్‌ అధ్యక్షులు పాకలపాటి వెంకట సత్యనారాయణ రాజు కోరారు. శుక్రవారం మండలంలోని కోలంక, పెదలంక, పల్లిపాలెం, నామవానిపాలెం గ్రామాలలో పర్యటించి అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహ ఆవిష్కరణ గోడపత్రికను కోలంకలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సత్యనారాయణరాజు మాట్లాడుతూ... స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటిష్‌వారిని గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహ ఆవిష్కరణను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ నెల 4 న భీమవరంలో ఆవిష్కరిస్తారని తెలిపారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి, గవర్నర్‌ హరిచందన్‌ హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి అభిమానులు తరలిరావాలని ఆయన కోరారు. ఈ గోడపత్రిక ఆవిష్కరణలో యానాం క్షత్రియ పరిషత్‌ అధ్యక్షులు భూపతిరాజు రామచంద్రరాజు, ఆత్మ కమిటీ మాజీ అధ్యక్షులు డి.వి.నరసింహారాజు, డి.రామభద్రరాజు, దాట్ల ఆనంద్‌, రవీంద్రవర్మ, దంతులూరి వంశీ, డి.లక్ష్మీపతిరాజు, చంటిబాబు, నానిబాబు, తదితరులు పాల్గన్నారు.