Apr 20,2023 21:37

న్యూఢిల్లీ : హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కైజాడ్‌ భరుచా నియామకానికి ఆర్‌బిఐ ఆమోదం తెలిపింది. భరుచా నియామకం బుధవారం నుంచే అమల్లోకి వచ్చింది. 2023 ఏప్రిల్‌ 29 నుంచి మూడేళ్ల పాటు ఆయన ఈ హోదాలో కొనసాగనున్నారు. ఇంతక్రితం ఈ హోదాలో ఐదేళ్లు పని చేసిన పరేష్‌ సుక్తాంకర్‌ 2022 నవంబర్‌లో రాజీనామా చేశారు. భరుచాకు బ్యాంకింగ్‌ రంగంలో 35 ఏళ్ల విశేష అనుభవం ఉంది.