బహుముఖీనంగా తెలుగు సాహిత్యానికి సేవలందిస్తున్న కలిమిశ్రీకి పద్మభూషణ్ గుర్రం జాషువా స్మారక కళాపరిషత్ 35వ వార్షికోత్సవ వేడుకల్లో మహాకవి జాషువా పురస్కారం అందజేయనుంది. ఏప్రిల్ 23న తెనాలిలో జరిగే వేడుకల్లో కలిమిశ్రీని 'సాహితీ తపస్వి' బిరుదుతో సత్కరించనున్నట్టు జాషువా స్మారక కళాపరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. పెద్దింటి యోహాన్ తెలిపారు. కలిమిశ్రీ అసలు పేరు కలిమికొండ సాంబశివరావు. ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, జ్యోతిచిత్ర పత్రికల్లో ఉప సంపాదకులుగా పనిచేశారు. సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ సాహిత్యంలో కొత్తతరాన్ని తయారుచేసే కషిలో నిమగమయ్యారు. 2007 నుంచి నవ మల్లెతీగ మాసపత్రికను నడుపుతున్నారు.










