
హైదరాబాద్ : రిలయన్స్ జియో కొత్తగా వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీస్ ఎయిర్‌ఫైబర్‌ను విడుదల చేసింది. దీన్ని దేశంలో హైదరాబాద్ సహా 8 నగరాల్లో తొలుత అందుబాటులోకి తెచ్చినట్లు ఆ కంపెనీ మంగళవారం వెల్లడించింది. ఆరు ప్లాన్లతో అందిస్తోన్నట్లు పేర్కొంది. దీని నెలవారి రుసుంల శ్రేణీని రూ.599 నుంచి రూ.3,999గా నిర్ణయించింది. హైఎండ్ ప్లాన్‌లో వినియోగదారులు గరిష్టంగా 1జిబిపిఎస్ వేగంతో ఇంటర్నెట్‌ను పొందవచ్చని పేర్కొంది. దీంతో 550 కంటే ఎక్కువ డిజిటల్ టివి ఛానెల్‌లను, 16 ఒటిటిలను యాప్‌లను అందిస్తున్నట్లు తెలిపింది. ప్రారంభ ప్లాన్ రూ.599లో 30 ఎంబిపిఎస్ వేగంతో డేటాను పొందవచ్చని.. అన్ని ప్లాన్లు కూడా ఏడాది వ్యవధితో లభిస్తాయని.. 12 నెలల ప్లాన్లపై ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు ఉండవని పేర్కొంది. లేదంటే ఇన్‌స్టాలేషన్ కోసం రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.