Mar 08,2023 21:29

హైదరాబాద్‌ : రిలయన్స్‌ జియో కొత్తగా 27 నగరాల్లో 5జి సేవలను ప్రారంభించినట్లు వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా మరో 9 పట్టణాల్లో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు ఆ సంస్థ గురువారం తెలిపింది. దీంతో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 331 నగరాలు, పట్టణాల్లో 5జి సేవలను విస్తరించినట్లయ్యిందని పేర్కొంది. కొత్తగా ఆంధ్రప్రదేశ్‌లోని తాడిపత్రిలో, తెలంగాణలోని జగిత్యాల, కోదాడ, కొత్తగూడెం, నిర్మల్‌, సంగారెడ్డి, సిద్దిపేట, తాండూరు, జహీరాబాద్‌ .పట్టణాల్లో 5జిని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. ఆయా ప్రాంతాల పరిధిలోని వినియోగదారులు జియో వెల్‌కమ్‌ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చని తెలిపింది. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే 1జిబిపిఎస్‌ కంటే ఎక్కువ వేగంతో అపరిమిత డేటాను వాడుకోవచ్చని వెల్లడించింది. 2023 ముగింపు నాటికి దేశ వ్యాప్తంగా 5జి సేవలను అందుబాటులోకి తేనున్నట్లు రిలయన్స్‌ జియో ప్రకటించిన విషయం తెలిసిందే.