
'ప్రజా రక్షణ భేరి' యాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం ఈ యాత్ర బృందం జిందాల్ కంపెనీని పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'కంపెనీని ఏర్పాటు చేస్తామని చెప్పి రైతుల దగ్గర నుంచి జిందాల్ కంపెనీ 12 వందల ఎకరాల్ని తీసుకుంది. 15 ఏళ్ల క్రితం జిందాల్ కంపెనీ వందల ఎకరాల భూమిని రైతుల వద్ద నుంచి తీసుకున్నా.. ఇప్పటివరకు ఎటువంటి కంపెనీని ఏర్పాటు చేయలేదు' అని ఆయన విమర్శించారు. కంపెనీ కోసం తీసుకున్న వందల ఎకరాల భూమిని తక్షణమే రైతులకి తిరిగి భూమిని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

