Sep 27,2023 21:21
  • ఆరు నెలల్లో 80% ర్యాలీ

ముంబయి : ప్రభుత్వ రంగంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ షేర్లు స్టాక్‌ మార్కెట్‌లో పరుగులు పెడుతున్నాయి. గడిచిన ఆరు నెలల్లో ఏకంగా 81.48 శాతం ర్యాలీ చేశాయి. బిఎస్‌ఇలో బుధవారం 2.75 శాతం పెరిగి రూ.81.52కు చేరింది. ఇది 52 వారాల గరిష్ట స్థాయికి ఎగిసింది. ప్రస్తుత నెలలో పిఎన్‌బి షేరు కొనుగోళ్ల డిమాండ్‌తో 28 శాతం లాభాలను పంచింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలు నమోదు చేయడం.. మదుపర్లలో విశ్వాసాన్ని పెంచింది. 2023-24 తొలి త్రైమాసికంలో రూ.1,255 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో కేవలం రూ.308.4 కోట్ల లాభాలకు పరిమితమయ్యింది.