Sep 29,2023 21:31

న్యూఢిల్లీ : వచ్చే ఏడాది నుంచి జెట్‌ ఎయిర్‌వేస్‌ విమాన సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయని జలాన్‌ కర్లాక్‌ కన్షార్షియం వెల్లడించింది. తాజాగా దివాలా ప్రక్రియకు మరో రూ.100 కోట్లు నగదు జమ చేసినట్లు పేర్కొంది. దీంతో ఆ సంస్థ ఇప్పటి వరకు రూ.350 కోట్లు పెట్టుబడి పెట్టినట్లయ్యింది. ఆర్థిక సంక్షోభంతో 2019లో ఈ సంస్థ మూత పడగా.. దివాలా పరిష్కార ప్రక్రియలో జలాన్‌ కర్లాక్‌ బిడ్డింగ్‌లో దక్కించుకుంది.