బ్యూనస్ ఎయిర్స్ : అర్జెంటీనా నూతన అధ్యక్షుడిగా సీనియర్ ఆర్థిక వేత్త జేవియర్ మిల్లా ఎన్నికయ్యారు. ఆదివారం అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో మిల్లాకు 55.8 శాతం ఓట్లు పోలైనట్లు ప్రభుత్వ వెబ్‌సైట్ పేర్కొంది. ఈ ఎన్నికల్లో సెర్గియో మాసాకు 44.2శాతం ఓట్లు వచ్చినట్లు తెలిపింది.
గత 20 ఏళ్లలో 16 సంవత్సరాల పాటు అర్జెంటీనాను పరిపాలించిన పెరోనిస్ట్ మూవ్‌మెంట్ పార్టీ అధ్యక్షుడు సెర్గియో మాసా ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఈ సారి ప్రజలు భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారంటూ.. అధ్యక్షుడు మిల్లాకు అభినందనలు తెలిపారు. డిసెంబర్ 10న జేవియర్ మిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. విక్టోరియా విల్లర్రుయెల్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.