బ్యూనస్ ఎయిర్స్ : తమ దేశం ఎప్పటికీ విప్లవాన్ని విడిచిపెట్టదని, బెదిరింపులకు భయపడదని క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్- కానెల్ పేర్కొన్నారు. అర్జెంటీనా శాసనసభ్యులు, రాజకీయ, సామాజిక, కార్మిక, మరియు సంఘీభావ సంస్థల ప్రతినిధులతో రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో డియాజ్ కానెల్ ఈ వ్యాఖ్యలు చేశారు. సామ్రాజ్యవాద దురాక్రమణలను ఎదుర్కొంటూనే తమకు సహకరిస్తున్న తమ సోదరులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. పరాజయాన్ని ఎప్పటికీ తలవంచదని చెప్పారు. సామ్రాజ్య వాద దురాక్రమనణలను ఎదుర్కోవడంలో తమ దేశానికి సహకరిస్తున్న తమ సోదరులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. తాము గెలవడానికి మరియు మెరుగైన ప్రపంచాన్ని స్థాపించడానికి పోరాడుతూనే ఉంటామని, ఇందుకు మీ సహకారం కావాలని అన్నారు. మంగళవారం జరగనున్న కమ్యూనిటీ ఆఫ్ లాటిన్ అమెరికన్ అండ్ కరేబియన్ స్టేట్స్ (సిఇఎల్‌ఎసి) దేశాల 7వ సదస్సులో... ప్రాంతీయ సమైక్యత, భిన్నత్వంలో ఏకత్వం, మరియు ఈ ప్రాంతాన్ని 'పీస్ జోన్'గా ప్రకటించడాన్ని సమర్థించారు. తమ దేశంపై అమెరికా విధించిన నిర్బంధాన్ని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల జాబితాలో చేర్చడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. గ్రూప్ ఆఫ్ 77 ప్లస్ చైనా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన క్యూబా ఈ సమావేశానికి హాజరవుతుందని ఉద్ఘాటించారు. ఈ సదస్సులో సామ్రాజ్యవాద ఆంక్షలను అధిగమించేందుకు చర్యలను ప్రతిపాదించాలని సూచించారు. మనల్ని మనం విముక్తి చేసుకోవాలని, సామాజిక ఉద్యమాల్లో ప్రజల క్రియాశీల భాగస్వామ్యాన్ని సాధించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.