బ్యూనస్ ఎయిర్స్ : అర్జెంటీనాలో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సోమవారం ఉదయం 8.35 గంటల సమయంలో అర్జెంటీనాలో భూకంపం సంభవించింది. వెడల్పు : 38.15, పొడవు : 70.28, 169 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు ఎన్‌సిఎస్ ట్వీట్‌లో పేర్కొంది. అయితే భూకంపం వల్ల ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని ఎన్‌సిఎస్ వెల్లడించింది.