
టోక్యో: జపాన్ మాస్టర్స్ సూపర్500 బ్యాడ్మింటన్ టోర్నీ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్‌లో రాణించి ఒలింపిక్స్ బెర్త్‌కు చేరువ కావాలన్న లక్ష్యంతో టాప్‌క్లాస్ షట్లర్లంతా ఈ టోర్నీ బరిలో దిగుతున్నారు. మహిళల సింగిల్స్‌లో పివి సింధుతోపాటు గాయం నుంచి కోలుకున్న హెచ్‌ఎస్ ప్రణయ్ రాయ్ బరిలోకి దిగుతున్నాడు. తొలి రౌండ్‌లో ప్రణయ్.. అన్‌సీడెడ్ లీ చెక్ యూ(హాంకాంగ్)తో తలపడనున్నాడు. ఇక సింధు తొలిరౌండ్‌లో డెన్మార్క్‌కు చెందిన రెండో సీడ్ మియా బ్లిచ్‌ఫ్లెడ్‌ను ఢకొీననుంది. సాత్విక్-చిరాగ్ ద్వయం చైనీస్ తైపీకి చెందిన ఎలూ చింగ్ యావో, యాంగ్ పొ యాన్ జోడీతో తలపడనుండగా.. లక్ష్యసేన్‌కు క్వార్టర్‌ఫైనల్లో రెండో సీడ్ ఆంథోని సినిసుక గింటింగ్(ఇండోనేషియా)తో గట్టిపోటీ ఎదురుకానుంది. ప్రస్తుతం బీడబ్ల్యూఏ ర్యాకింగ్స్‌లో 17వ స్థానంలో ఉన్న లక్ష్యసేన్, 23వ స్థానంలో కొనసాగుతున్న శ్రీకాంత్ తమ ర్యాంక్‌లు మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారించారు.