జానుడి - సెంటర్ ఫర్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్, మల్లవరపు మధుర సాహిత్య భారతి, ఒంగోలు, తెలంగాణా భాషా సాంస్క ృతిక శాఖ ఆధ్వర్యంలో మధుర కవి మల్లవరపు జాన్ స్మారక సాహిత్య పురస్కార సభ జులై 8వ తేదీ ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాలులో జరుగుతుంది. ఈ సభలో ప్రముఖ సాహితీ వేత్త, మీడియా విశ్లేషకులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ (2020), ప్రముఖ కవి, సాహితీ వేత్త డాక్టర్ శిఖామణి (2021), ప్రముఖ కవి, అనువాదకులు ముకుంద రామారావు (2022)లకు పురస్కారాలు అందజేస్తాము.
- డాక్టర్ నూకతోటి రవికుమార్, మల్లవరపు ప్రభాకరరావు










