న్యూఢిల్లీ : నైకా నేచురల్ హెయిర్ తమ ప్రచారకర్తగా జాన్వీ కపూర్‌ను నియమించుకున్నట్లు ఆసంస్థ ప్రకటించింది. ''జాన్వీ అద్భుతమైన చర్మం, స్వదేశీ పదార్థాల పట్ల ఆమె ప్రేమతో కూడిన అనుబంధానికి పేరుగాంచింది. నైకా నేచురల్ హెయిర్ కేర్ శ్రేణి యాపిల్ సైడర్ వెనిగర్, అల్లం, మెంతులు, ఉల్లిపాయలు, ఉసిరికాయ, కరివేపాకు, పులియబెట్టిన రైస్ వాటర్, బగ్గు, షికాకాయ్ మొదలైన సాంప్రదాయక జుట్టును ఇష్టపడే పదార్థాలతో నింపబడి ఉంది. భారతీయ వాతావరణం, నీరు, జీవనశైలి, విభిన్న జుట్టు రకాలను విశ్లేషించి అందంగా ఆరోగ్యకరమైన జుట్టు కోసం దీన్ని అభివఅద్ధి చేయబడింది.'' అని నైకా కన్స్యూమర్ బ్యూటీ బ్రాండ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ విశాల్ గుప్తా పేర్కొన్నారు.










