హైదరాబాద్ : వచ్చే డిసెంబర్‌లో జైపూర్ జ్యువెలరీ షోను ఏర్పాటు చేస్తున్నట్లు జెజెఎస్ గౌరవ కార్యదర్శి రాజీవ్ జైన్ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ.. ఈ రోడ్‌షోలో వివిధ నగరాల నుంచి పలువురు అభరణాల వర్తకులు జ్యువెలర్స్ హాజరయ్యారు. డిసెంబర్ 22 నుంచి 25వరకు జరగనున్న 21వ ఎడిషన్ ప్రదర్శనకు అంతర్జాతీయ వర్తకులు కూడా హాజరు కానున్నారన్నారు. దాదాపు 40వేల మంది సందర్శకులు హాజరు కావొచ్చన్నారు.