Oct 25,2023 11:46

కేరళ : 'జైలర్‌' చిత్రంలో విలన్‌గా నటించిన వినాయకన్‌ను కేరళ పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు. తమను వినాయకన్‌ ఇబ్బంది పెడుతున్నారంటూ ఆయన నివాసముంటున్న అపార్ట్‌మెంట్‌ వాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ... వినాయకన్‌ను ఎర్నాకుళం టౌన్‌ నార్త్‌ పోలీసులు స్టేషన్‌ను పిలిపించారు. మద్యం మత్తుతో ఉన్న వినాయకన్‌ సహనం కోల్పోయి ఎర్నాకుళం టౌన్‌ నార్త్‌ పోలీస్‌ స్టేషన్‌లో గొడవకు దిగాడు. అతడిని వారించేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం వినాయకన్‌ను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ... ఈ నేపథ్యంలో ... వినాయకన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయడం ఇదే తొలిసారి కాదని, ఓ మోడల్‌ను వేధించిన కారణంగా గతంలోనూ అతడిని అరెస్ట్‌ చేయగా.. ఆ తర్వాత బెయిల్‌ పై విడుదలయ్యారంటూ... మలయాళ, తమిళ మీడియాలో వార్తలచ్చాయి. 'జైలర్‌' విడుదలైన సమయంలో ఈ కథనాలు నెట్టింట హల్‌చల్‌ చేశాయి.