Jul 06,2023 17:39
  •  మైనార్టీ రాష్ట్ర కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఇక్బాల్‌ అహ్మద్‌

ప్రజాశక్తి-కలికిరి (అన్నమయ్య) : ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టడం ప్రవేశపెట్టడం జరిగిందని ముస్లిం మైనారిటీ రాష్ట్ర కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఇక్బాల్‌ అహ్మద్‌ తెలిపారు. మండలంలోని మహల్‌ చీకటి పల్లి పంచాయతీలలో జగన్‌ సురక్ష కార్యక్రమం ఎంపీడీవో గంగయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ముస్లిం మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఇక్బాల్‌ అహ్మద్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా చూడడానికి, గ్రామ సచివాలయంలో లభించే అన్ని సేవలను ప్రజలకు ఉచితముగా అందజేయడానికి నెలరోజులపాటు ఈ జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించి ప్రజా సమస్యలు పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు చీకటి పల్లి సర్పంచ్‌ సురేందర్‌ రెడ్డి, మహల్‌ సర్పంచ్‌ వైసిపి నాయకులు రియాజ్‌ అహ్మద్‌, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.