
ప్రజాశక్తి-గణపవరం(పశ్చిమగోదావరి) : ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పేదలకు వరం లాంటిదని గణపవరం ఎంపీడీవో జి.జ్యోతిర్మయి అన్నారు. మంగళవారం ఎస్ కొండేపాడులో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు గ్రామ సర్పంచ్ ఎస్ వీర వరలక్ష్మి అధ్యక్షత వహించారు. సభలో ఎంపీడీవో జ్యోతిర్మయి మాట్లాడుతూ.. ఖరీదైన వైద్యాన్ని పేదలకు ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. దీనిని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. వైద్య శిబిరంలో 115 మందికి వైద్య సేవలు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ పి.లక్ష్మి, ఈవో పిఆర్‌డి పివి.సత్యనారాయణ, ఎంఇఓ పి.శేషు, గణపవరం పిఎచ్చ్.సి.డాక్టర్లు. పి.సంతోషనాయుడు, శ్వేత, వైసిపి నాయకులు జి.సూర్యనారాయణ, ఐవి.రాజు, కాకరశ్యామ్, హెల్త్ సూపర్ వైజర్ వెంకటేశ్వర్లు, ఆరోగ్య సహయకులు నామాలరాజు, గ్రామ కార్యదర్శి అన్నకుమారి, ఆషాలు, అంగన్వాడీ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.