Sep 14,2023 11:05

ప్రజాశక్తి-పాలకొల్లు (పశ్చిమగోదావరి) : చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా పాలకొల్లులో 2వ రోజు గురువారం దాసరి విగ్రహం వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. యలమంచిలి మండలంకు చెందిన నేతలు ఈరోజు దీక్షల్లో కూర్చున్నారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ వీరికి పూలమాలలు, నల్ల రిబ్బన్లు అందించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ.. జగన్‌కు రాష్ట్ర అభివృద్ధి మీద కన్నా చంద్రబాబు అనుయాయులపై కక్ష సాధింపు చర్యలు, కేసులు, అక్రమ అరెస్ట్‌లపైనూ శ్రద్ధ ఉందన్నారు. ప్రజలు అనేక సమస్యల్లో ఉంటే జగన్‌ మంత్రివర్గం, అధికారులు చంద్రబాబుపై కేసులు ఇరికించటంలోనే నిమగమయ్యారని విమర్శించారు.