Sep 13,2023 16:42

ప్రజాశక్తి-పాలకొల్లు (పశ్చిమగోదావరి) : చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ గాంధీ బొమ్మల సెంటర్లో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌, మాజీ మంత్రి పీతల సుజాత టిడిపి శ్రేణులతో కలిసి బాబుతో మేము సైతం అంటూ బుధవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చంద్రబాబు అక్రమ కేసుల నుండి బయటకి వచ్చేంత వరకు టిడిపి శ్రేణులంతా అండగా తోడుగా ఉంటారని చెప్పారు. తాలిబన్లను, హిట్లర్‌, ముషారఫ్‌ని మించి నిరంకుశ పాలన ఈరోజు జగన్‌ అందిస్తున్నారని చెప్పారు. అక్రమ అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలకు పిలుపునిచ్చినట్లు చెప్పారు. ఈ నిరసన దీక్షలతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబుకి అండగా తోడుగా ఉండాలని చైతన్య కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నట్లు చెప్పారు.