న్యూఢిల్లీ : ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ జాగ్వర్ లాండ్ రోవర్ (జెఎల్‌ఆర్) 2023ా24 ప్రథమార్థం (హెచ్1)లో రికార్డ్ అమ్మకాలను నమోదు చేసినట్లు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన కాలంలో 105 శాతం వృద్థితో 2,356 యూనిట్ల విక్రయాలు చేసినట్లు పేర్కొంది. గతేడాది ఇదే కాలంలో 1,308 యూనిట్ల అమ్మకాలు చేసింది. గడిచిన హెచ్1లో మెరుగైన ప్రగతిని కనబర్చామని జెఎల్‌ఆర్ ఇండియా ఎండి రాజన్ అంబా పేర్కొన్నారు.