ప్రజాశక్తి - జీలుగుమిల్లి (ఏలూరు) : లేగ దూడల సంరక్షణ పాడి రైతుల బాధ్యతని పశు గణన కార్య నిర్వహణ అధికారి జేసురత్నం అన్నారు. మంగళవారం దర్భ గూడెం పశు వైద్యశాలలో లేగ దూడల ప్రదర్శన, వాటి పెంపకంపై పాడి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాడి రైతులకు దూడల సంరక్షణ, వాటి పెంపకంపై అవగాహన కల్పించారు. అనంతరం జీలుగుమిల్లి పశువైద్య సహాయ సంచాలకులు డాక్టర్ ఎ.డి.సాయి బూచ్చరావు మాట్లాడుతూ.. పాడి రైతులకు ఏడాదికి ఒక దూడ వచ్చినట్లయితే రైతుకు లాభ సాటిగా ఉంటుందన్నారు. ఆ విధంగా ప్రతి రైతు ఉత్తమ పద్ధతుల్ని పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 40 దూడలు పాల్గొనగ ఇందులో మొదటి బహుమతి పైడిమాల సత్తిరెడ్డి, రెండో బహుమతి దొంగ మురళి, మూడో బహుమతి కొడెల్లి నాగేశ్వరరావు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యురాలు డాక్టర్ లక్ష్మి ప్రసన్న, దర్భ గూడెం సొసైటీ అధ్యక్షులు కొల్లూరి రాంబాబు సర్పంచ్ సున్నం ఉషారాణి, ఎంపీటీసీలు సున్నం సురేష్, కె.సుధారాణి, ఉపసర్పంచ్ రాఘవరెడ్డి, ప్రకాశం, పశు వైద్య సిబ్బంది అమ్ములు,రాజు, అచ్యుతరావు, భవాని పాల్గొన్నారు.










