వందే భారతం
వంద గదుల ఇంద్రభవనం
ప్రపంచ వీధుల్లో
ప్రకాశించు ప్రజాస్వామ్య చిహ్నం
వంకలేని పాలనం
వందమంది సోదరులం
అందరం హక్కుదారులం
అయినా సగం మంది తలదాచగ
మూలనున్న మూడు గదుల నిచ్చినాం
పది మంది పవళింపగ
డెబ్భై ఏడు గదులనుంచినాం
పాడిపంటల నా దేశం..
ఇంటి నిండా ధాన్యం
అయినా జన కోటికి
కూటికి నోచుకోని దైన్యం
ఒక్కడు తినడానికి
నలభై విస్తళ్లు పరిచినాం
ఏభై మందికి కలిపి
మూడు పిడికిళ్లు పెట్టినాం
వ్యత్యాసాల ఈ విధానం
మార్చడమే అత్యవసరం
అధిక జనుల అర్ధాకలి
కానేరదు శుభకరం
అందరి అభివృద్ధియే
నిజానికి నాగరికం
దేశానికి సౌభాగ్యకరం.
(దేశ సంపదలో పది శాతం మంది చేతిలో 77 శాతం, ఒక శాతం చేతిలో 40 శాతం వాటాలుండగా ...యాభై శాతం మంది కేవలం 3 శాతం వాటా కలిగి వున్నారని చెప్తున్నాయి గణాంకాలు.)
- డా. డి.వి.జి.శంకరరావు,
సెల్ : 94408 36931.










