పెద్ద దేవుడు వస్తుంటే
పూనకాలు ఢంకాలై కదిలాయి
సారు మెప్పు కోసం
నడవలేని కాళ్ళు కోళ్లులా కలియ తిరిగాయి
రాష్ట్రంపై
ఏ వరాల జల్లులో కురిసి మురిపిస్తాయని
ఆశ పడుతుంటే
చిరు జల్లులు పక్కున నవ్వి
చెమటల్ని తుడిచాయి!
సారు రాకడ ఉనికి కోసం
ఊయల పాటలానే ఉంది
ఉక్కపోతల నడుమ
గంధం పూతలా ఉంది
జరిగింది ఏదీ లేదు
ఒరిగింది ఏమీ లేదు
ప్రజాధనం వొలికిపోయే ఆర్భాటం తప్ప
ఆవగింజంత సాయం లేదు
అచ్చేదిన్ అంటూ ఊక దంపుడు
సమస్యలు కోకొల్లలు ఉన్నా
చూపులు పొత్తులపై నిలుపుతూ
కళ్లుండీ కభోది ఆటను ఆడి
కొత్త కసరత్తుల్ని చక్కగా మలిచారు
సారొచ్చారు...,
సమస్యలకు ప్రశ్న మార్కులా నిలిచారు...
- మహబూబ్ బాషా చిల్లెం
9502000415










