న్యూఢిల్లీ : గడిచిన ఎనిమిదేళ్లలో రూ.23.2 లక్షల కోట్ల ముద్రా రుణాలు జారీ చేయడం జరిగిందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. చిరు వ్యాపారుల కోసం ఉద్దేశించిన ముద్రా పథకం ప్రారంభించి ఎనిమిదేళ్లు అయ్యిందన్నారు. ఇప్పటి వరకు దీని వల్ల 40.82 కోట్ల మంది లబ్ధి పొందారన్నారు. కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి, వ్యాపార విస్తరణకు ఆర్థిక చేయూతను అందించేందుకు రూ.10 లక్షల వరకు తనఖా లేని రుణాలను అందించేందుకు సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం దీన్ని ఏర్పాటు చేశారు. రుణాల పొందిన వారిలో 51 శాతం మంది ఎస్‌సి, ఎస్‌టి, బిసి వర్గాల వారున్నారని మంత్రి పేర్కొన్నారు.










