
ప్రజాశక్తి రైల్వేకోడూరు (అన్నమయ్యజిల్లా) : అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కు పాదం మోపుతామని అన్నమయ్య జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు అన్నారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు రాజంపేట డిఎస్పి చైతన్య, సిఐ మధుసూదన్ రెడ్డి, ఎస్సైలు సుభాష్ చంద్రబోస్, డాక్టర్ నాయక్, వెంకటేశ్వర్లుతో నేరాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులు స్థానిక ట్రాఫిక్ సమస్యలు, పట్టణంలో జరుగుతున్న అసాఘిక కార్యకలాపాలపై ఎస్పీ దృష్టికి తీసుకురాగా ఆయన స్పందించి ట్రాఫిక్ సమస్యను అదుపు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేపడతామని అలాగే గంజాయి అక్రమ మద్యం మట్కా లాంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వాటిని అదుపు చేసేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు.ఏవైనా సమ్యలుంటే తన దృష్టికి గానీ, స్థానిక సిఐ దృష్టికి గానీ, తీసుకురావచ్చునని అన్నారు. అనంతరం మహిళా పోలీసులతో ఆయన సమీక్ష నిర్వహించారు.