మరో గ్రంథాలయోద్యమం ఇవాళ్టి అవసరం. లీడ్ లైబ్రరీ ఆధ్వర్యాన అనేక గ్రామాల్లో లైబ్రరీలు ఏర్పాటు చేస్తున్నాం. ఇదే తరహాలో గ్రామగ్రామాన విజ్ఞాన భాండాగారాలు వెలిసేలా ప్రయత్నించడం అవసరం. సాంకేతిక వనరులు ఎన్ని వున్నా పుస్తకం పట్టుకొని చదివే అలవాటును ఈకాలం విద్యార్థులలో, యువతలో ప్రోది చేయాలి. వారిని గ్రంథాలయాల వైపు నడిపించాలి. కనుక ఈ విషయమై స్పందించి, గ్రంథాలయం ఇతివృత్తంగా కవితలని పంపించవలసిందిగా కవులను ఆహ్వానిస్తున్నాం. 'జ్ఞానదీపం-గ్రంథాలయం' పేరుతో పాలపిట్ట బుక్స్ - లీడ్ లైబ్రరీ కలిసి ఒక కవితా సంకలనం ప్రచురించాలని సంకల్పించాం. కనుక కవితలను పంపించండి. వస్తు శిల్పాలలో నవ్యతని పాటించే కవితలకే ప్రాధాన్యం. కవితలు పంపడానికి చివరి తేదీ మార్చి 30, 2023. మీ కవితలను palapittabooks@gmail.com లేదా kasula.ravikumar8@gmail.com కు ద్వారా పంపగలరు. వివరాలకు : 9490099327, 7981068048.
- కాసుల రవికుమార్, లీడ్ లైబ్రరీ










