Aug 14,2023 07:32

ప్రామాణికమైన విమర్శనా వ్యాసాలతో ఒక పుస్తకాన్ని ప్రచురించాలని 'పాలపిట్ట బుక్స్‌' సంస్థ సంకల్పించింది. 'సంశోధన' శీర్షికన ×ూదీచీ నెంబర్‌తో ఈ వ్యాసాల పుస్తకం వెలువడుతుంది. సాహిత్య విమర్శ, పరిశోధనలలో ఉన్నతమైన విలువలతో కూడిన వ్యాసాల్ని పరిశోధకుల నించి, విమర్శకుల్నించి ఆహ్వానిస్తుంది. ఈ పుస్తకంలో అన్ని కొత్త వ్యాసాలు ఉంటాయి. అకాడమిక్‌ ప్రమాణాల్ని పాటిస్తూ వ్యాసాలు సమగ్రంగా, సరికొత్త ప్రతిపాదనలతో, విశ్లేషణలతో కూడినవై ఉండాలి. తెలుగు సాహిత్యంలోని విభిన్న ప్రక్రియల మీద రాయవచ్చు. వ్యాసంతో పాటు ఎంట్రీ ఫీజుగా రూ. 2000 పంపించాలి. మీ వ్యాసాలు పంపించాల్సిన చిరునామా : ఎడిటర్‌, పాలపిట్ట బుక్స్‌, ఫ్లాట్‌ నెం: 2, బ్లాక్‌-6, ఏపిహెచ్‌బి, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌-500044. వఎaఱశ్రీ: జూaశ్రీaజూఱ్‌్‌abశీశీసరఏస్త్రఎaఱశ్రీ.షశీఎ వ్యాసాలు పంపడానికి చివరి తేదీ : 24 ఆగస్టు 2023. అక్టోబర్‌ నెలలో కొడవటిగంటి కుటుంబరావు జయంతి సందర్భంగా ఈ పుస్తకం విడుదల అవుతుంది. ఇతర వివరాలకు సంప్రదించాల్సిన మొబైల్‌ నెం : 98487 87284.
- గుడిపాటి, ఎడిటర్‌, పాలపిట్ట బుక్స్‌