Jan 09,2023 07:38

తెలుగులో ఉత్తమ వచన కవిత్వాన్ని ఆవిష్కరిస్తున్న కవులకు ఏటా పాలమూరు సాహితీ అవార్డులను ప్రదానం చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ అవార్డును ప్రముఖ కవులు డా. రాధేయ, డా. కాసుల లింగారెడ్డి, డా. పెన్నా శివరామకృష్ణ, కందుకూరి శ్రీరాములు, అంబటి నారాయణ, ఎస్‌.హరగోపాల్‌, కోట్ల వెంకటేశ్వర రెడ్డి, డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి, చిత్తలూరి సత్యనారాయణ, తగుళ్ళ గోపాల్‌ అందుకున్నారు. ఈ పురస్కారం కోసం 2021లో ముద్రితమైన వచన కవితా సంపుటాలను మూడేసి ప్రతులను పంపించాల్సిందిగా కోరుతున్నాం. కవులు తమ ప్రతులను డాక్టర్‌ భీంపల్లి శ్రీకాంత్‌, ఇ.నం. 8-5-38, టీచర్స్‌ కాలనీ, మహబూబ్‌ నగర్‌ - 509001 చిరునామాకు 2023 మే 31 లోపు పంపాలి.ఉత్తమ వచన కవితా సంపుటికి రూ.5,116 నగదు బహుమతితో పాటు జ్ఞాపికను అందజేస్తారు.
- డాక్టర్‌ భీంపల్లి శ్రీకాంత్‌, వ్యవస్థాపకులు
పాలమూరు సాహితి అవార్డు .. 90328 44017