Oct 24,2023 12:12

తెలంగాణ : యుకెలోని ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఆహ్వానం అందింది. ఈ నెల 30న యూనివర్సిటీలో నిర్వహించే కార్యక్రమంలో 'డెవలప్‌మెంట్‌ ఎకనామిక్స్‌' అనే అంశంపై కవిత ప్రసంగించనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కీలకోపన్యాసం చేయనున్నారు. ఇటీవల బ్రిడ్జ్‌ ఇండియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడానికి లండన్‌లో పర్యటించిన సమయంలో యూనివర్సిటీ విద్యార్థులతో కల్వకుంట్ల కవిత భేటీ అయిన సంగతి విదితమే. దీంతో తెలంగాణ అభివృద్ధి మోడల్‌ పై ఈ నెల 30వ తేదీన ప్రసంగించాల్సిందిగా కోరుతూ యూనివర్సిటీ ఆహ్వానం పంపింది.