Oct 29,2023 12:23

తెలంగాణ : '' ఒకసారి అభిమాని అయితే అంతే.. ఇక ఎప్పటికీ అభిమానిగానే ఉండిపోతాం '' మెగాస్టార్‌ చిరంజీవికి చాలా పెద్ద అభిమానిని అంటూ ... బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. 'ఆస్క్‌ కవిత' పేరుతో నెటిజన్లతో ఇంటరాక్ట్‌ అయిన కవిత.. ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు జవాబుగా.. 'చిరంజీవి ఆల్వేజ్‌!!! నెక్ట్స్‌ అల్లు అర్జున్‌.. తగ్గేదేలే' అని జవాబిచ్చారు. పాలిటిక్స్‌ లో, నిత్యం ప్రజాసేవలో బిజీబిజీగా గడుపుతున్నప్పటికీ చిరంజీవి సినిమాలు తప్పకుండా చూస్తానని అన్నారు. చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని కవిత గతంలోనూ పలు సందర్భాల్లో వెల్లడించారు. మెగస్టార్‌ చిరంజీవికి 'డై హార్డ్‌ ఫ్యాన్‌' అని చెప్పిన కవిత.. చిరు తర్వాత అల్లు అర్జున్‌ నటన అంటే ఇష్టమని చెప్పారు. గతంలోనూ... ఓ టీవీ ఛానెల్‌ ఇంటర్వూలో కవిత మాట్లాడుతూ.. మీ అభిమాన హీరో ఎవరన్న యాంకర్‌ ప్రశ్నకు చిరంజీవి అని చెప్పారు. ఇప్పటికీ ఆయనే మీ ఫేవరేట్‌ హీరోనా అని యాంకర్‌ మరో ప్రశ్న సంధించగా.. ఒకసారి అభిమాని అయితే అంతే.. ఇక ఎప్పటికీ అభిమానిగానే ఉండిపోతామని కవిత స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో మరోసారి వైరల్‌ గా మారింది.