'ఖమ్మం ఈస్ధటిక్స్' పేరిట ఈ ఏడాది పురస్కారాలు అందజేయనున్నాం. 2023 అవార్డుల కోసం కవితా సంపుటులను, కథలను ఆహ్వానిస్తున్నాం. మూడు ఉత్తమ కధలకు మొదటి బహుమతిగా రూ.25 వేలు, రెండవ బహుమతిగా రూ.15 వేలు, మూడవ బహుమతిగా రూ.10 వేలు అందచేస్తాం. ఉత్తమ కవితా సంపుటికి రూ.40 వేల నగదు బహుమతి ఉంటుంది. కవితా సంపుటి 2022 ఏప్రిల్, 2023 మార్చి మధ్య ప్రచురితమై ఉండాలి. కనీసం 25 కవితలకు తగ్గకుండా ఉండాలి. పురస్కారం కోసం కవితా సంపుటి నాలుగు ప్రతులను పంపాలి. పోటీకి పంపే కధలు కేవలం ఈ పురస్కారం కోసం మాత్రమే రాసినవై ఉండాలి. కథ ప్రింట్ నాలుగు ప్రతులను పోస్టులో, యూనికోడ్ సాఫ్ట్ కాపీని మెయిల్లో పంపాలి. ఖమ్మంలో నవంబర్‌లో జరిగే వేడుకలో అవార్డుల ప్రదానం ఉంటుంది. ఆగస్టు 31, 2023లోగా రచనలు పంపాల్సిన చిరునామా : ఖమ్మం ఈస్ధటిక్స్ సాహిత్య పురస్కారాలు, హార్వెస్ట్ స్కూలు, 5-7-200/11, పాకబండ, ఖమ్మం - 507003. వాట్సాప్ : 98491 14369. ఖష్ట్రaఎఎaఎaవర్‌ష్ట్రవ్‌ఱషరఏస్త్రఎaఱశ్రీ.షశీఎ










