హైదరాబాద్ : టెక్నాలజీ సంస్థ కంట్రోల్‌ఎస్ భారీ విస్తరణ ప్రణాళికలు చేపట్టినట్లు పేర్కొంది. ఇందుకోసం వచ్చే ఆరేళ్లలో 2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.16వేల కోట్ల) పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొంది. 2030 కల్లా తమ హైపర్‌స్కేల్ డాటా సెంటర్ సామర్థ్యాన్ని పెంచుకోనున్నట్లు వెల్లడించింది. అదే విధంగా ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేసుకోవడానికి, కార్బన్ న్యూట్రల్‌గా అవతరించడానికి ఈ పెట్టుబడులను వినియోగించుకోవాలని యోచిస్తోంది. ప్రస్తుతం దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో కంట్రోల్‌ఎస్‌కు 234 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 12 డాటా సెంటర్లున్నాయి. వచ్చే ఆరేళ్లలో 1000కిపైగా ఉద్యోగులను తీసుకోనున్నట్లు పేర్కొంది.