Nov 08,2023 21:40

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో :ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, సిబిఐ న్యాయస్థానికి, సిబిఐకి తెలంగాణ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై సిబిఐ కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలోగా తేల్చాలని మాజీ ఎంపి హరిరామజోగయ్య దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌.వి.శ్రావణ్‌కుమార్‌ ధర్మాసనం బుధవారం విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌ను పిల్‌గా పరిగణించేందుకు మొదట హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరాలు తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తుతం సిఎంగా ఉన్నారని, ఆయనపై పెండింగ్‌లో ఉన్న కేసులు చాలా తీవ్రమైనవని పిటిషనర్‌ తరుఫు న్యాయవాది రాధాకృష్ణ కోర్టు దృష్టికి తెచ్చారు. తన క్లయింట్‌ దాఖలు చేసిన పిల్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరారు. పిటిషనర్‌ వాదనతో ఉన్నత న్యాయస్థానం ఏకీభవి పిల్‌కు నంబర్‌ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.