న్యూఢిల్లీ : ముకేష్ అంబానికి చెందిన రిలయన్స్ జియో దేశంలో తొలి శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను ప్రారంభించింది. శుక్రవారం ఈ సేవలను భారత మొబైల్ కాంగ్రెస్‌లో ప్రధాని మోడి లాంచనంగా ఆవిష్కరించారు. జియో స్పేస్ ఫైబర్ పేరుతో భారత్‌లో ఇప్పటి వరకు ఇంటర్నెట్ సదుసాయం లేని ప్రాంతాలకు దీని ద్వారా వేగవంతమైన బ్రాండ్‌బ్యాండ్ సేవల ను అందించనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ప్రతి ఇంటికీ డిజిటల్ సేవలను చేరువ చేయడానికి జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ వంటి బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులతో పాటు జియో స్పేస్ ఫైబర్‌ను కూడా ప్రారంభించామని తెలిపింది. తాజా శాటిలైట్ నెట్‌వర్క్‌తో జియో ట్రూ 5జి సేవలు సైతం దేశంలోని ప్రతి ప్రాంతానికి అందుతాయని పేర్కొంది. జియో స్పేస్ ఫైబర్‌తో ఎక్కడి నుంచైనా గిగాబిట్ యాక్సెస్‌తో ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వ, విద్య, ఆరోగ్య, వినోదాత్మక సేవలను పొందొచ్చు'' అని రిలయన్స్ జియో ఇన్ఫోకమ్ లిమిటెడ్ ఛైర్మన్ ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు.