May 29,2023 08:15

ప్రసాదమూర్తి దీర్ఘకవిత 'యుద్ధమే శాంతి' పరిచయ సభ జూన్‌ 4 (ఆదివారం) ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం కథానిలయంలో, సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నం పబ్లిక్‌ లైబ్రరీలో జరగనుంది. అట్టాడ అప్పలనాయుడు అధ్యక్షత వహిస్తారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రుంకు అప్పారావు పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. బొర్రా గోవర్ధన్‌, ఆచార్య చల్లపల్లి స్వరూపరాణి దీర్ఘ కవితను పరిచయం చేస్తారు. గంటేడ గౌరునాయుడు, మల్లిపురం జగదీష్‌, మాటూరి శ్రీనివాస్‌, సియ్యార్కె, ఎస్‌ఆర్‌ వేమన, దుర్గారావు తదితరులు పాల్గొంటారు.
- సిక్కోలు బుక్‌ ట్రస్ట్‌