Mar 15,2023 13:09

ప్రజాశక్తి - ఏలూరు : ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో వివిధ పోస్టుల భర్తీకి మార్చి 18న ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ డా. మేజర్‌ ఎం. వీ భీమేశ్వర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18వ తేదీన ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అభ్యర్థులకు ప్రిన్సిపాల్‌ కార్యాలయం నందు ఇంటర్వ్యూలు జరపబడనున్నాయని ఆయన ప్రకటనలో వెల్లడించారు. శనివారం ఈ పోస్టుల అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరుగనున్నాయి. జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, ఓబిజి, అనస్థీషియా, పెడియాట్రిక్స్‌ ఆర్థోపెడిక్‌, ఆఫ్మాలజి , ఈఎన్టి, రేడియాలజీ, యమర్జెన్సీమెడిసిన్‌, అనాటమీ, ఫీజీయోలజీ, బయో-కెమిస్ట్రీ, ఫార్మ కాలజీ, మైక్రో బయాలజీ, పాథాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, ఎస్‌పిఎం పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తీసుకుని రావలసిన సర్టిఫికెట్స్‌ ఎస్‌ఎస్‌సి సర్టిఫికెట్‌ , ఎమ్‌.బి.బీ.ఏస్‌, పీజీ, డిగ్రీ సర్టిఫికెట్స్‌, మెడికల్‌ కౌన్సిల్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, పీజీ మార్కుల లిస్టు, సోషల్‌ స్టేటస్‌ సర్టిఫికెట్‌, ఆధార్‌ కార్డు 4వ తరగతి టు 10 వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్‌లతో ఇంటర్వ్యూ కి హాజరు కావాలని డా. మేజర్‌ మ్‌ వీ భీమేశ్వర్‌ కోరారు.