Feb 09,2023 20:46

హైదరాబాద్‌ : ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ డాక్టర్‌ రెడ్డీస్‌ లాబరేటరీస్‌కు అంతర్జాతీయ బ్లూమ్‌బర్గ్‌ జెండర్‌ ఈక్వాలిటీ ఇండెక్స్‌(జిఇఐ) 2023లో చోటు దక్కించుకున్నట్లు తెలిపింది. వరుసగా ఆరోసారి తమ సంస్థకు ఈ గుర్తింపు దక్కిందని తెలిపింది. ఫార్మాస్యూటికల్‌ విభాగంలో ఈ ఘనత పొందిన ఏకైక భారతీయ కంపెనీగా నిలిచిందని పేర్కొంది. 2023 సూచికలో మొత్తం 45 దేశాల్లోని 11 రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 484 కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 16 ట్రిలియన్‌ డాలర్లు పైనా ఉన్న కంపెనీలను ఇందులో పరిగణలోకి తీసుకున్నారు.