- స్కూట్ ఎయిర్‌లైన్స్ డిస్కౌంట్
- వైజాగ్ నుంచి రాయితీ
న్యూఢిల్లీ : అతి చౌక ధరలో అంతర్జాతీయ విమానయానం అందిస్తోన్నట్లు సింగపూర్ ఎయిర్‌లైన్స్ (ఎస్‌ఐఎ) అనుబంధ సంస్థ స్కూట్ వెల్లడించింది. ప్రారంభ ధర రూ.7600 నుంచే పలు దేశాలకు ప్రయాణం చేయవచ్చని పేర్కొంది. ఈ టికెట్ల అమ్మకాలు సెప్టెంబర్ 18 నాటితో ముగుస్తాయని తెలిపింది. 38 గమ్యస్థానాలకు డిస్కౌంట్ ప్రయాణాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొంది. హైదరాబాద్, విశాఖపట్నం నుంచి కౌలాలంపూర్, జకార్తా, బాలి, సింగపూర్, హనోయి, సిడ్నీ, మెల్‌బోర్న్, పెర్త్ నగరాలకు రూ.8,990 నుంచి రూ.15,900 ఛార్జ్‌తో ప్రయాణం చేయవచ్చని తెలిపింది. సింగపూర్‌కు రూ.8,900తోనే ప్రయాణం చేయడానికి వీలు కల్పిస్తోన్నట్లు పేర్కొంది. దేశంలోని ఇతర ముఖ్య నగరాల నుంచి కూడా ఆఫర్లను అందిస్తుంది. ఆగస్ట్ 2024లోపు ఎంపిక చేసిన తేదిల్లో మాత్రమే ప్రయాణించడానికి వీలుంటుందని తెలిపింది.










