హైదరాబాద్: ఏప్రిల్ 21 నుంచి 23 వరకు హైదరాబాద్‌లో రైస్ బ్రాన్ ఆయిల్‌పై 7వ అంతర్జాతీయ సదస్సు (ఐసిఆర్‌బిఒ) జరగనుంది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రైస్ బ్రాన్ ఆయిల్ (ఐఎఆర్‌బిఒ), సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసొసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఇఎ) భాగస్వామ్యంతో దీన్ని నిర్వహిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్‌ఇఎ ఇండియా అధ్యక్షుడు అజరు ఝున్‌ఝువాలా, ఐఎఆర్‌బిఒ సెక్రటరీ జనరల్ బివి మెహతా, జెమినీ ఎడిబల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి చంద్రశేఖర రెడ్డి సదస్సు వివరాలను వెల్లడించారు. ఈ సదస్సులో 400 మందికి పైగా ప్రతినిధులు పాల్గొననున్నారని తెలిపారు. రైస్ బ్రాన్ ఆయిల్ ఉత్పత్తి దేశాలైన ఇండియా, చైనా, థాయిలాండ్, జపాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వియాత్నం తదితర దేశాల నుంచి ప్రత్యేక అథిథులు రానున్నారని పేర్కొన్నారు.










