'పద్యానికి పట్టాభిషేకం' తేజోమయం - తెలుగు పద్యం శీర్షికన తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని పద్యపోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి లభించిన అపూర్వ స్పందన నేపథ్యంలో మరొకసారి పద్య పఠనపు పోటీలను నిర్వహించాలని తలపెట్టింది శ్రీ వాగ్దేవి కళాపీఠం. ఈ పోటీల్లో పాల్గొనడానికి దరఖాస్తు చేయడానికి ఆఖరు తేదీ 30 ఏప్రిల్. ఈ పోటీల్లో ప్రపంచంలో ఎక్కడ నివసించేవారైనా పాల్గొనవచ్చు. ఈ పోటీల్లో పాల్గొనడానికి ఎలాంటి ప్రవేశ రుసుము లేదు. ఎటువంటి వయోపరిమితి లేదు .పూర్తి వివరాలకు 93913 56105 చరవాణిలో సంప్రదించగలరు.
- వి. వి. ఎల్ .శ్రీనివాస మూర్తి, శ్రీ వాగ్దేవి కళాపీఠం










