Aug 19,2023 14:32

ప్రజాశక్తి-జి సిగడాం(శ్రీకాకుళం) : రాష్ట్రం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే ముమ్మరంగా జరుగుతున్నాయని తహశీల్దార్‌ పప్పల వేణుగోపాలరావు అన్నారు. పెంట గ్రామంలో భూ సర్వేను ప్రారంభించి మాట్లాడుతూ.. కీలకమైన డ్రోన్‌ సర్వే, ఆ తర్వాత దశల్లో జరిగే క్షేత్ర స్థాయి నిజ నిర్ధారణ, గ్రౌండ్‌ వాలిడేషన్‌ వంటి పనులన్నీ చకచకా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. డ్రోన్‌ సర్వేను మండలంలో 43 రెవెన్యూ గ్రామాలకు 20 గ్రామాలకు రీ సర్వే పూర్తి చేసామని ఇప్పటికే 10 గ్రామాలకు డ్రోన్‌ ఫ్లయింగ్‌ జరిగిందని మిగతా 13గ్రామాల్లో రీ సర్వే వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్రోన్‌ ఫ్లయింగ్‌ సర్వే అధికారులు కె.ప్రసాద్‌, ఐ.నవీన్‌, ఎం.ఈశ్వరరావు, గ్రామ సర్పంచ్‌ ప్రతినిధి పున్నాన అక్కలనాయుడు, మక్క నారాయణరావు, గ్రామ సర్వే భాను ప్రసాద్‌, పంచాయతీ కార్యదర్శి పి.సురేష్‌, వీఆర్వో వేణుగోపాలరావు, వీఆర్‌ఏ బాలకృష్ణ, మక్క శ్రీను, అశోక్‌ కుమార్‌, అప్పల రాజు, పావని, కంది నగేష్‌ పాల్గొన్నారు.